న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టాప్ 40 హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ (సీహెచ్‌ఆర్‌వో) జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ (పీపుల్ అండ్ టాలెంట్) ఇరా బింద్రా ర్యాంకు మరింత మెరుగుపడింది. గతేడాది 28వ ర్యాంకులో ఉండగా తాజాగా 19వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, ఈ గ్లోబల్ లిస్టులో వరుసగా రెండో ఏడాది భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావడం గనార్హం. అడ్వైజరీ సేవలందించే గ్లోబల్ సంస్థ ఎన్2గ్రోత్ ఏటా ఈ ర్యాంకులు ఇస్తుంది.
తమ తమ సంస్థల పనితీరు, సిబ్బంది, వర్క్‌ప్లేస్ సంస్కృతిని సానుకూలంగా ప్రభావితం చేసిన టాప్ 40 మంది చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్లకు పురస్కారాలు ఇస్తుంది. ఈ ఏడాది ’స్పష్టత’ థీమ్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. అంతర్జాతీయ బిజినెస్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో బింద్రాకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రిలయన్స్‌లో చేరడానికి ముందు ఆమె అమెరికాకు చెందిన మెడ్‌ట్రానిక్, జనరల్ ఎలక్ట్రిక్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సీనియర్ హోదాలో పని చేశారు.


