రెన్యూవబుల్స్‌పై అమెజాన్‌ ఫోకస్‌ | Amazon to invest 7 billion dollars in India renewables by 2030 | Sakshi
Sakshi News home page

రెన్యూవబుల్స్‌పై అమెజాన్‌ ఫోకస్‌

Nov 18 2026 5:06 AM | Updated on Nov 18 2026 5:06 AM

Amazon to invest 7 billion dollars in India renewables by 2030

7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 

2030కల్లా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యం 

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దేశీయంగా భారీ పెట్టుబడులకు తెరతీస్తోంది. 2030కల్లా పునరుత్పాదక(రెన్యూవబుల్‌) ఇంధన ప్రాజెక్టులపై 7 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 67,000 కోట్లు) వెచ్చించే ప్రణాళికలు వేసింది. తద్వారా దేశీ శుద్ధ ఇంధన మార్కెట్లో మరింత విస్తరించాలని చూస్తోంది. కంపెనీ కార్యకలాపాలకు పెరుగుతున్న విద్యుత్‌ అవసరాల నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించుకునే లక్ష్యంతో అదనపు పెట్టుబడులకు తెరతీస్తున్నట్లు అమెజాన్‌ తాజాగా పేర్కొంది. 

దేశీయంగా ఇప్పటికే రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టులపై 4 బిలియన్‌ డాలర్లు వెచ్చించిన కంపెనీ కర్బనరహిత ఇంధన కొనుగోలులో దేశీయంగా అతిపెద్ద కార్పొరేట్‌ దిగ్గజాలలో ఒకటిగా నిలవనుంది. మరోవైపు కొత్తగా నాలుగు భారీస్థాయి సోలార్, విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులను సైతం ప్రకటించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఏర్పాటు చేయనున్న వీటి ఉమ్మడి సామర్థ్యం 934 మెగావాట్లుకాగా.. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) ద్వారా వీటికి తెరతీస్తోంది. 

ఇవి ప్రస్తుత 4 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్ట్‌డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోలో భాగంకావడం గమనార్హం! ఈ జాబితాలో కర్ణాటకలోని 234 మెగావాట్ల విండ్‌ ప్రాజెక్ట్, 200 మెగావాట్ల హైబ్రిడ్‌(సోలార్, విండ్‌) ప్రాజెక్ట్‌సహా మధ్యప్రదేశ్‌లోని 300 మెగావాట్ల సోలార్, రాజస్తాన్‌లోని 200 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ పూర్తయితే అమెజాన్‌ కాంటాక్ట్‌డ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల సామర్థ్యం 2 గిగావాట్లను మించనుంది. ఇది 3.5 మిలియన్‌ భారతీయ కుటుంబాల వార్షిక విద్యుత్‌ అవసరాలకు సమానమని అమెజాన్‌ పేర్కొంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement