పెళ్లికానివాళ్లకు బంపరాఫర్‌! 3 ఏళ్లలో పెళ్లి గ్యారంటీ!! | China app marriage guarantee full refund 3-years | Sakshi
Sakshi News home page

పెళ్లికానివాళ్లకు బంపరాఫర్‌! 3 ఏళ్లలో పెళ్లి గ్యారంటీ!!

Nov 11 2026 4:30 PM | Updated on Nov 11 2026 4:33 PM

China app marriage guarantee full refund 3-years

చైనాకు చెందిన ఓ స్టార్టప్‌ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. తమ యాప్‌ ద్వారా మూడేళ్లలో పెళ్లి కుదరకపోతే సభ్యత్వ రుసుమును పూర్తిగా వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసే ఈ విధానం ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఒక్కరితోనే పరిచయం

చైనాలో ప్రారంభమైన ‘లియాంగ్‌పెయ్‌ ఏఐ’ (Liangpei AI) అనే ఈ యాప్‌ సాధారణ డేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో వినియోగదారులు ఒకేసారి ఎక్కవ మందితో మాట్లాడేందుకు అవకాశం ఉండదు. ఏఐ సూచించిన అభ్యర్థుల్లో ఒకరితో మాత్రమే పరిచయం కొనసాగించాలి. ఆ వ్యక్తితో సంబంధాన్ని ముగించిన తర్వాతే మరో వ్యక్తిని పరిచయం చేసుకునే వీలుంటుంది. ఈ విధానం ద్వారా ఒకరిపై మరొకరు ఎక్కువ శ్రద్ధ పెట్టడంతోపాటు, సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి తగిన సమయం కేటాయించవచ్చని సంస్థ భావిస్తోంది.

యాప్‌లో నమోదు చేసుకునే సమయంలో వినియోగదారులు తమ అసలు పేరు, ఫొటోతో పాటు తమకింకా పెళ్లి కాలేదని ధ్రువీకరించుకోవాలి. ఇప్పటికే వివాహమైన వ్యక్తులు ప్రవేశించకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత వినియోగదారులు ఏఐ మ్యాచ్‌మేకర్‌తో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడాలి. తద్వారా వినియోగదారుల వ్యక్తిత్వం, అభిరుచులకు అనుగుణంగా సమగ్ర ప్రొఫైల్‌ను రూపొందిస్తుంది.

సభ్యత్వ రుసుము ఎంతంటే?

ఈ యాప్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం దాని వ్యాపార విధానం. మూడేళ్ల కాలపరిమితి కలిగిన ప్రత్యేక ‘పెళ్లి హామీ సభ్యత్వం’ కోసం 2,000 చైనీస్‌ యువాన్లు (సుమారు రూ.28,000) చెల్లించాలి. మూడేళ్లలోపు వివాహం చేసుకోకపోతే నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు, 1,000 యువాన్లకు జీవితకాల సభ్యత్వాన్ని కూడా సంస్థ అందిస్తోంది. అయితే దానికి డబ్బుల వాపసు హామీ ఉండదు. ఈ విధానం వెనుక బలమైన వ్యాపార ఆలోచన ఉందని సంస్థ వ్యవస్థాపకుడు జెంగ్‌ జిన్‌షున్‌ చెబుతున్నారు. సాధారణ డేటింగ్‌ యాప్‌లు వినియోగదారులు ఎక్కువకాలం తమ ప్లాట్‌ఫామ్‌లలో కొనసాగితేనే ఆదాయం పొందుతాయని, కానీ జీవిత భాగస్వామిని వెతికే సేవల లక్ష్యం మాత్రం వీలైనంత త్వరగా వారికి సరైన జోడీని అందించడమే కావాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement