ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ రేంజ్‌ | Ather Energy Unveils the Rizta S with 3 7kWh Battery Pack | Sakshi
Sakshi News home page

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ రేంజ్‌

Jul 2 2025 3:25 PM | Updated on Jul 2 2025 3:45 PM

Ather Energy Unveils the Rizta S with 3 7kWh Battery Pack

భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో సర్వీసులు అందిస్తున్న ఏథర్ ఎనర్జీ 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రిజ్టా ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. మెరుగైన బ్యాటరీ వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. రూ.1,37,047 ఎక్స్ షోరూమ్ ధరతో దీన్ని విపణిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: ‘ప్రభుత్వ నిమయాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’

ఫీచర్లు ఇవే..

  • 3.7 కిలోవాట్ల లిథియం అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 159 కి.మీ సామర్థ్యం ఉంటుంది.

  • ఓవర్ నైట్ హోమ్ ఛార్జింగ్, ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ వేరియంట్‌ల్లో లభిస్తుంది.

  • ఏడు అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే టెక్నాలజీ అందిస్తున్నారు.

  • థెఫ్ట్ అలర్ట్స్, ఫైండ్ మై స్కూటర్, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి సాంకేతికత ఇందులో ఉందని కంపెనీ తెలిపింది.

  • ఓటీఏ(ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్‌లు ఎనేబుల్ చేయవచ్చని పేర్కొంది.

  • 34 లీటర్ల అండర్ సీట్ స్పేస్‌ ఉంటుందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement