నేటినుంచి మూడో విడత నామినేషన్లు
మహబూబాబాద్: జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మొదటి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. కాగా, ఈనెల 3నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 5వ తేదీ వరకు స్వీకరించనున్నారు. అందుకోసం 51 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మూడో విడతలో ఆరు మండలాల్లో 169 గ్రామపంచాయతీలు, 1,412 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆరు మండలాలు..
జిల్లాలోని డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 169 గ్రామపంచాయతీలు, 1412 వార్డులు ఉ న్నాయి. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో వారే కీలకం కానున్నారు. పురుష ఓటర్లు 84,140మంది, మహిళా ఓటర్లు 87,350 మంది ఉన్నారు. 3,210 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
నేటి నుంచి స్వీకరణ..
ఈనెల 3నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూడో విడత నామమినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 6న పరిఽశీలన, అదే రోజు సాయంత్రం 5గంటల తర్వాత అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తారు. 7వ తేదీన అప్పీళ్లు, 8న పరిష్కారం, 9వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు ఉపసంహరణ, అదేరోజు 3గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేస్తారు. 17వ తేదీన ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2గంటల తర్వాత లెక్కింపు, వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంంది.
51 క్లస్టర్లు ఏర్పాటు..
నామినేషన్ల స్వీకరణ కోసం అధికారులు 51క్లస్టర్లు ఏర్పాటు చేశారు. డోర్నకల్ మండలంలో 7క్లస్టర్లు, గంగారం 3, కొత్తగూడ 8, కురవి 12, మరిపెడ 14, సీరోలు మండలంలో 7 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అందుకుగాను 51 మంది ఆర్వోలు, ఒక ఏఆర్వో, అదనంగా పదిమంది ఆర్వోలు, సపోర్టు స్టాఫ్‌గా పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లను కేటాయించారు.
అర్ధరాత్రి వరకు నామినేషన్లు
ఆరు మండలాల్లో 169 జీపీలు, 1,412వార్డులు
51క్లస్టర్లలో ఏర్పాట్లు పూర్తి
నేటినుంచి 5వ తేదీ వరకు
నామినేషన్ల పర్వం
మహిళా ఓటర్లే అధికం
నేటినుంచి మూడో విడత నామినేషన్లు


