గీసుకొండ: ‘ఏ లోకం వెళ్లినవే.. మమ్మెట్ల వీడినవే. అయ్యో రాజమౌళి అన్నా ఏడబోయినవే నీవు’ అంటూ గంగదేవిపల్లి గ్రామస్తులు, ఊర్ల నుంచి తరలివచ్చిన అభిమానుల కుమిలికుమిలి ఏడ్చారు. జా తీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి అభివృద్ధి ప్రదా త కూసం రాజమౌళి అంతిమ యాత్ర సోమవారం భావోద్వేగంతో కొనసాగింది. గుండెపోటుతో మృతి చెందిన రాజమౌళి అంతిమయాత్రకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పలు శాఖల అఽ దికారులు, ఉమ్మడి వరంగల్ నుంచే కాకుండే తెలంగాణ లోని పలు జిల్లాల నుంచి అభిమానులు, పరిచయం ఉన్న వారు ఆయన కడసారి చూపునకు తరలిరావడంతో గంగదేవిపల్లి కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమౌళికి నివాళులర్పించడానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. గతంలో మొగిలిచర్లకు చెందిన మా వోయిస్టు నేత ఆర్‌కే అలియాస్ పోలెం సుదర్శన్‌రె డ్డి, ప్రజావైద్యుడు ఆమెడ నారాయణ మృతి చెందిన సందర్భంగా పల్లెల నుంచి నివాళులర్పించడానికి తండోప తండాలుగా తరలివచ్చిన రీతిలో రాజ మౌళి అంతిమయాత్రకు అదే తరహాలో ప్రజలు కదిలిరావడం విశేషం. ఆయన సేవాభావం, అందరితో కలివిడిగా ఉండడం.. గ్రామాన్ని జాతీయ స్థా యిలో ఆదర్శంగా నిలిపిన తీరు, అధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలు ఇవన్నీ కలిపి రాజమౌళి ఇంటి నుంచి శ్మశాన వాటిక వద్దకు అంతిమయాత్ర ఐదు గంటల పాటు సాగిందంటే ఆయనపై ప్రజలకు ఎంతటి అభిమానం ఉందో తెలుస్తోంది. సీపీఎం, ఎంసీసీఐ నాయకులు ర్యాలీగా తరలివచ్చి నివాళులర్పించారు.
ప్రజాప్రతినిధులు, నాయకుల పరామర్శ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధ ర్మారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నాగ య్య, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆ యూబ్ మహమ్మద్, బీజేపీ నాయకుడు కాళీ ప్రసా ద్, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, కౌసల్యాదేవి, బాలవికాస డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి, ఎంపీడీఓ కృష్ణవేణి, తహసీల్దార్ రియాజుద్దీన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు బాలికిశోర్‌రెడ్డి, నవీన్‌రాజు, రాజ్‌కుమార్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, ఎంసీపీఐ నాయకులు తరలివచ్చి రాజమౌళి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ఎవరేమి అన్నారంటే.
రాజమౌళి అంతిమయాత్రను ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని మాజీ మంత్రి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. గంగదేవిల్లిని జాతీయ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మహనీయుడు రాజమౌళి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గంగదేవిపల్లి గ్రామాభివృద్ధికి రాజమౌళి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్ మహమ్మద్ అన్నారు. కమ్యూనిస్టు నేతలు మాట్లాడుతూ రాజమౌళికి జాతీయ స్థాయిలో విలేజ్ లీడర్‌షిప్ అవార్డును ఇవ్వాలని, ఆయన స్మారక విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కమాలోద్దీన్, కరాటే ప్రభాకర్ పాల్గొన్నారు.
బోరున విలపించిన గంగదేవిపల్లి,
అభిమానులు
కూసం రాజమౌళికి భావోద్వేగ వీడ్కోలు
అంతిమయాత్రకు తరలివచ్చిన ఊర్లు


