
ఎలక్ట్రిక్ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా ఓ100 (ఓ హండ్రెడ్) పేరిట రెండో ప్లాట్‌ఫాంపై కసరత్తు చేస్తోంది. రూ.1 లక్ష లోపు ధర ఉండే మోటర్ సైకిల్స్ తయారీ కోసం దీన్ని ఉపయోగించనున్నట్లు కంపెనీ ఫౌండర్ మధుమిత అగర్వాల్ తెలిపారు.
ఈ ప్లాట్‌ఫాంపై రూపొందించిన వాహనాలను ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆవిష్కరించనున్నట్లు వివరించారు. దేశీ టూ వీలర్ల మార్కెట్లో దాదాపు 30 శాతం వాటా ఉంటున్న 100 సీసీ వాహనాలకు సరిసమాన సామర్థ్యం ఉండే ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనున్నట్లు మధుమిత అగర్వాల్ పేర్కొన్నారు.