మీడియాటెక్‌తో జియోథింగ్స్‌ జట్టు | Jio Platforms partners MediaTek for electric 2 Wheelers IoT platform | Sakshi
Sakshi News home page

మీడియాటెక్‌తో జియోథింగ్స్‌ జట్టు

Jul 26 2024 7:57 AM | Updated on Jul 26 2024 11:30 AM

Jio Platforms partners MediaTek for electric 2 Wheelers IoT platform

న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల సంస్థ మీడియాటెక్, జియో ప్లాట్‌ఫామ్స్‌ అనుబంధ సంస్థ జియోథింగ్స్‌ జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించాయి. ఇది టూవీలర్ల మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్‌ డిజిటల్‌ క్లస్టర్, స్మార్ట్‌ మాడ్యూల్స్‌ను అందిస్తుంది.

ఈ విభాగంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.రియల్‌ టైమ్‌ డేటా అనలిటిక్స్, స్మార్ట్‌ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ మొదలైన వాటికి స్మార్ట్‌ డిజిటల్‌ క్లస్టర్‌ ఉపయోగపడుగుతుంది. జియో వాయిస్‌ అసిస్టెంట్, జియోసావన్‌ మొదలైన సర్వీసులు ఉండే జియో ఆటోమోటివ్‌ యాప్‌ సూట్‌కి ఈ ప్లాట్‌ఫాం ద్వారా యాక్సెస్‌ లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement