Electric Snow Bike: అద్భుతమైన బైక్‌.. దీనికి ముందువైపు చక్రం బదులుగా..

American Company Invents Moon Bikes Worlds First Electric Snow Bike - Sakshi

మనదేశంలో వీథుల్లోను, రహదారుల్లోను మంచు పేరుకుపోయే సమస్య దాదాపు లేదు గాని, ప్రతిఏటా శీతకాలంలో పాశ్చాత్యదేశాల్లో ఇదొక పెద్ద సమస్య. మంచులో చక్రాలు చిక్కుకుపోయి వాహనాలు ముందుకు సాగవు. మంచుదారిలో కాలినడక మరీ ప్రమాదకరం. రహదారులపై మంచు పేరుకుపోయినా సరే, ఏమాత్రం ఇబ్బందిలేకుండా ప్రయాణించడానికి వీలుగా అమెరికన్‌ కంపెనీ ‘మూన్‌బైక్స్‌’ ఇటీవల ఒక అద్భుతమైన బైక్‌ను రూపొందించింది.

దీనికి ముందువైపు చక్రం బదులు, మంచును చీల్చుకుపోయే పదునైన పరికరాన్ని అమర్చారు. వెనుకవైపు యుద్ధట్యాంకుల మాదిరిగా చైన్లతో కూడిన రెండు చక్రాలు ఉండటం వల్ల ఎగుడుదిగుడు మంచుదారిలో కూడా ఈ బైక్‌ మహాజోరుగా సాగిపోగలదు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌ బైక్‌ కావడం వల్ల దీనివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీని ధర 8500 డాలర్లు (రూ.6.94 లక్షలు) మాత్రమే!

చదవండి: జియో బంపర్‌ ఆఫర్‌.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top