జియో బంపర్‌ ఆఫర్‌.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!

Reliance Jio New Prepaid Plan: Offers Extra 75 Gb Data, 23 Days Validity With Rs 2999 - Sakshi

టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కస్టమర్లకు తనవైపు తిప్పుకుని దూసుకుపోతూ రిలయన్స్ జియో సంచలనంగా మారింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది జియో. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. కొత్త ఏడాది కానుకగా తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు అదనంగా కొన్ని రోజుల వ్యాలిడిటీ, ఉచిత డేటా వంటి బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్‌ ఏంటో తెలుసుకుందాం!

జియో యూజర్లకు.. స్పెషల్‌ ఆఫర్‌
వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి నెలవారీ ప్లాన్‌ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వార్షిక ప్లాన్‌లతో, కస్టమర్‌లు ప్రతి నెలా వారి ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడంతో బోలెడు బెనిఫిట్స్‌ను పొందచ్చు.

రూ. 2999 ధర ఉన్న ప్రస్తుత వార్షిక ప్లాన్‌లో..  రోజుకు 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 365 రోజులు. అంతేకాకుండా ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు. జియో కస్టమర్‌లు ఈ ప్లాన్‌లో జియో టీవీ (Jio TV), జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు.

 ఈ వార్షిక ప్లాన్‌లో అందించే 2.5 GB రోజువారీ డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం 64Kbps స్పీడ్‌కి చేరకుంటుంది.. ఈ బెనిఫిట్స్‌తో పాటు మరింత ప్రయెజనాలు ఈ ప్లాన్‌లో జత చేసింది రిలయన్స్‌ జియో.  ప్రత్యేక ఆఫర్ కింద, 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 జీబీ ఉచితంగా డేటా కూడా ఉంటుంది. 

చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top