
మ్యాటర్ మోటర్ వర్క్స్ యోచన
వచ్చే మూడేళ్ల పాటు వరుసగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మ్యాటర్ మోటర్ వర్క్స్ గ్రూప్ సీవోవో అరుణ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తమ ఎలక్ట్రిక్ గేర్డ్ బైక్ ‘ఏరా’ (ఏఈఆర్‌ఏ)ని ఢిల్లీ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 60 డీలర్‌షిప్‌లను ప్రారంభించనున్నామని, వీటిలో అత్యధిక భాగం దక్షిణాదిలోనే ఉంటాయని సింగ్ వివరించారు.
ఇదీ చదవండి: ఐపీవోకు మీషో రెడీ
ప్రస్తుతానికి తాము మోటర్‌సైకిల్స్‌పైనే దృష్టి పెడుతున్నాయని, ఎలక్ట్రిక్ స్కూటర్ల యోచన లేదని చెప్పారు. తమ తొలి మోడల్ ఏఈఆర్‌ఏని ఆరేళ్ల పాటు రూపొందించామని, గతేడాది అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభించామని వివరించారు. తొలి ఏడాదిలో 10,000తో మొదలుపెట్టి రెండో ఏడాది 50,000–60,000 వరకు వాహనాలను విక్రయించే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్‌లోని తమ ప్లాంటుకు ప్రతి నెలా 10,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉందని సింగ్ తెలిపారు.