
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
ఫ్యాషన్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల ఈకామర్స్ కంపెనీ మీషో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులున్న కంపెనీ గోప్యతా విధానంలో ముందస్తు ఫైలింగ్‌ను చేపట్టినట్లు తెలుస్తోంది. గత నెల 25న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఐపీవోకు ప్రాస్పెక్టస్ దాఖలుపై నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. లిస్టింగ్ ద్వారా కనీసం రూ. 4,250 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి.
స్టాక్‌బ్రోకర్‌గా వన్ మొబిక్విక్
సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్
స్టాక్ బ్రోకర్, క్లియరింగ్ సభ్యులుగా వ్యవహరించేందుకు పూర్తి అనుబంధ సంస్థ మొబిక్విక్ సెక్యూరిటీస్ బ్రోకింగ్ (ఎంఎస్‌బీపీఎల్)కు అనుమతి లభించినట్లు మాతృ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. 2025 జులై1న సెబీ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలియజేసింది. వెరసి ఎంఎస్‌బీపీఎల్ దేశీ స్టాక్ బ్రోకర్‌గా కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు, క్లియరింగ్, ఈక్విటీ లావాదేవీల సెటిల్‌మెంట్లు చేపట్టనున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
తాజా లైసెన్స్ కారణంగా క్యాపిటల్ మార్కెట్లో సంపద పంపిణీ(వెల్త్ డి్రస్టిబ్యూషన్) విభాగంలో సేవలు మరింత విస్తరించేందుకు వీలుంటుందని తెలియజేసింది. తద్వారా సమీకృత ఫిన్‌టెక్ సంస్థగా అవతరించనున్నట్లు పేర్కొంది. మొబిక్విక్ గ్రూప్ అనుబంధ సంస్థ జాక్ ఈపేమెంట్ సర్వీసెస్(జాక్‌పే).. ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా సేవలందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే.