అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు | Sakshi
Sakshi News home page

అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

Published Mon, Apr 15 2024 5:26 PM

Ola Cheapest Scooter S1x Variants Now Come At Rs 69,999 - Sakshi

ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్‌ బైక్‌ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్‌1 ఎక్స్‌ మోడల్‌ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. 

గతంలో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‍లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. 

ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం ​​తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. 

ఓలా దాని ఎస్‌1ఎక్స్‌ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్‌1ఎక్స్‌ వేరియంట్‌ల ధరలు 5.6 శాతం,  9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం.  '

ఓలా ఎస్‌1 ఎక్స్‌ (4కేడబ్ల్యూహెచ్‌) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్‌ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది.   
 

Advertisement
 
Advertisement