అద్దె గృహాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కడంటే? | Rising Demand For Rental Homes In Hyderabad As Property Owners Favor Sales Over Rentals, More Details Inside | Sakshi
Sakshi News home page

అద్దె గృహాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కడంటే?

Mar 14 2026 9:52 AM | Updated on Mar 14 2026 11:27 AM

Demand for Rental Housing in Hyderabad

కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. విక్రయించే సమయంలో ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దె గృహాల మార్కెట్‌ క్రమంగా పెరుగుతోంది.

ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఉంది. ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లై తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌ పెరిగింది.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్‌ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్‌లో డిమాండ్‌ 50, సప్లై వాటా 39 శాతంగా ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్‌ ఎక్కువ ఉంది.

కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేల నుంచి రూ.35 వేల నెలవారీ అద్దెలకు కోసం అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్‌ ఎక్కువ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement