మ్యాటర్ ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర తక్కువ, సూపర్ డిజైన్

Matter aera e bike launched in india details - Sakshi

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో 'మ్యాటర్ ఎనర్జీ' (Matter Energy) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ 'ఏరా' లాంచ్ చేసింది. ఇది 4000, 5000, 5000+, 6000+ అనే నాలుగు వేరియంట్స్‌లో విడుదలైంది. ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు ఎక్స్-షోరూమ్). 

కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకుని నాలుగు వేరియంట్స్‌లో విడుదల చేసినప్పటికీ కేవలం మొదటి రెండు వేరియంట్స్‌ని మాత్రమే విక్రయిస్తుంది. మిగిలిన రెండు భవిష్యత్తులో విక్రయించబడతాయి. టాప్ వేరియంట్ 150 కిమీ రేంజ్ అందించగా, మిగిలిన మూడు వేరియంట్లు 125 కిమీ రేంజ్ అందిస్తాయి.

మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ 5kWh బ్యాటరీ, 10.5kW లిక్విడ్-కూల్డ్ మోటార్ పొందుతుంది. ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఏరా 5000 వేరియంట్ ఆప్సనల్ 7 ఇంచెస్ LCD టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కలిగి ఆప్సనల్ బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్, కీలెస్ ఆపరేషన్, OTA అప్‌డేట్‌లు, ప్రోగ్రెసివ్ బ్లింకర్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. 5000+ వేరియంట్లో లైఫ్‌స్టైల్, కేర్ ప్యాకేజీతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైక్, బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు. ఈ బైక్ 'ట్యాంక్'పై చిన్న 5 లీటర్ గ్లోవ్‌బాక్స్‌ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్ మరే ఇతర బైకులలో లేకపోవడం గమనార్హం.

(ఇదీ చదవండి: కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ ఎఫ్77.. డెలివరీస్ షురూ)

ప్రస్తుతం, కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీల గురించి అధికారిక సమాచారం అందకపోయినప్పటికీ, త్వరలో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top