
బెంగళూరు: ఒబెన్ ఎలక్ట్రిక్ సంస్థ మోటార్ సైకిల్ విభాగంలో ‘రోర్ ఈజెడ్ సిగ్మా’ పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.27 లక్షలు, 4.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.37 లక్షలుగా ఉంది.
కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. రూ.2,999 టోకెన్ అమౌంట్‌ను చెల్లించి, బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఆగస్టు 15 నుంచి మొదలవుతాయి. బ్రాండ్ అభివృద్ధి చేసిన ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీను ఇందులో ఉపయోగించారు. ఒకసారి పూర్తి చార్జింగ్‌తో 175 కిమీ వరకు ప్రయాణించవచ్చు. 3.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. రెండు వేరియంట్‌ల టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లు. గంటన్నరలో 80% వరకు చార్జ్ అవుతుంది.