ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు దారులకు శుభవార్త!

Ola Electric Offering Massive Discount Of Rs 20,000 On The Ola S1 X Electric Scooter - Sakshi

ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త చెప్పింది. ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరపై రూ.20,000 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ బైక్‌ ధర రూ.1,09,999 ఉండగా.. ధర తగ్గింపుతో రూ.89,999కే సొంతం చేసుకోవచ్చు. 

అయితే ఈ డిస్కౌంట్‌ కొత్తగా ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ కొనుగోలు దారులకు మాత్రమే అందుబాటులో ఉందని ఓలా పేర్కొంది. ఓలా ఎస్‌1ఎక్స్‌ సిరీస్‌లోని ఓలా ఎస్‌1 ఎక్స్‌ 3 కిలోవాట్ల బ్యాటరీ, ఓలా ఎస్‌1 ఎక్స్‌ 2 కిలో వాట్ల బైక్‌లను కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్‌ పొందలేరని వెల్లడించింది.      

ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ 3 వాట్ల బ్యాటరీతో జతచేసిన 6కిలో వాట్ల మోటార్‌ను అందిస్తుంది. ఇందులో మొత్తం మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. వాటిల్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్. ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40కేపీఎంహెచ్‌ నుండి 3.3 సెకన్లలో, 5.5 సెకన్లలో 0-60 కేపీఎంహెచ్‌ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 90కేఎంపీహెచ్‌.  

ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్‌ ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ రేంజ్‌ ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 151కిమీ అయితే, ఒరిజినల్‌ రేంజ్‌ ఎకో మోడ్‌లో 125కిమీ, సాధారణ మోడ్‌లో 100కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. 500డబ్ల్యూ పోర్టబుల్ ఛార్జర్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఇంట్లో కేవలం ఏడు గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. 

ఈ బైక్‌లోని ఫీచర్ల విషయానికొస్తే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టైలాంప్‌తో వస్తుంది. 5 అంగుళాల ఎస్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, డిజిటల్ కీ, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్,క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top