బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ న్యూమరస్ మోటర్స్ తమ రెండో ఈవీ టూవీలర్ ఎన్–ఫస్ట్‌ను ఆవిష్కరించింది. వేరియంట్‌ను బట్టి తొలి 1,000 మంది కొనుగోలుదారులకు దీని ప్రారంభ ధర రూ. 64,999గా ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు శ్రేయాస్ శిబులాల్ తెలిపారు.
ఇటలీకి చెందిన డిజైన్ హౌస్ వీల్యాబ్‌తో కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. వేరియంట్‌ని బట్టి 91 కి.మీ. నుంచి 109 కి.మీ. వరకు దీని రేంజి ఉంటుంది. 5–8 గంటల్లో సున్నా స్థాయి నుంచి 100 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. ఈ ఈవీ బైక్ సింపుల్ డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ 1979 మిమీ పొడవు, 686 మిమీ వెడల్పు & 1125 మిమీ ఎత్తు కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 1341 మిమీ.. గ్రౌండ్ క్లియరెన్స్ 159 మిమీ.


