
ముంబై: తొలి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 ఆఫర్‌తో రోడ్‌స్టర్ ఎక్స్ పోర్ట్‌ఫోలియో మోటార్ సైకిళ్ల డెలివరీలను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ‘‘మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశించే క్రమంలో ‘రోడ్‌స్టర్ ఎక్స్’ అనేది ఒక సాహసోపేతమైన ముందడుగు. ఈ డెలివరీతో ద్విచక్రవాహన కేటగిరిలో ఈవీ సామర్థ్యం అన్‌లాక్ అవుతుంది. ఈవీల వినియోగం, మరింత పుంజుకుంటుంది’’ అని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ ఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు.
ఓలా కంపెనీ రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌లో మోటార్‌సైకిల్స్‌ను 2.5కేడబ్ల్యూహెచ్, 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్‌లలో అందిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.99,999, రూ.1,09,999, రూ.1,24,999గా ఉన్నాయి. రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్‌లో సిరీస్‌లో 4.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1,29,999, మరో వేరియంట్ 9.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మోటార్ సైకిల్ ధర రూ.1,99,999గా ఉన్నాయి.