
టీవీఎస్ మోటార్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఎక్స్–షోరూం ధర రూ.1.03 లక్షలుగా ప్రకటించింది. ఇందులో అమర్చిన 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వల్ల సింగిల్ ఛార్జింగ్‌తో 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్, బ్యాక్‌రెస్ట్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు.
‘ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఐక్యూబ్ యూనిట్లు విక్రయించాం. డ్యూయల్ టోన్ కలర్స్‌తో రోజు వారీ అనువైన ప్రయాణాలకు అనుగుణంగా తాజా ఐక్యూబ్‌ను తీర్చిదిద్దాం. కొత్త వేరియంట్ విడుదల ద్వారా విద్యుత్ వాహన విభాగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం’ అని టీవీఎస్ కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’
టఫే, ఏజీసీవో వివాదం సెటిల్మెంట్
మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వివాదాన్ని టఫే, ఏజీసీవో కార్పొరేషన్ సంస్థలు కోర్టు వెలుపల పరిష్కరించుకున్నాయి. సెటిల్మెంట్ ప్రకారం ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ (టఫే) సంస్థ రూ.2,225 కోట్లు చెల్లించి మాసే ఫెర్గూసన్‌లో ఏజీసీవో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, నేపాల్, భూటాన్‌లో ఈ బ్రాండు పూర్తి యాజమాన్య హక్కు లు టఫేకు దక్కుతాయి. ఏజీసీవో కార్పొరేషన్ గత సెపె్టంబర్‌లో మాసే ఫెర్గూసన్ బ్రాండ్ లైసెన్స్ సహా టఫేతో ఉన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది.