ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్‌ లాంచ్ చేసిన ఆడి: ధర, ప్రత్యేకతలు

Audi electric mountain bike launched price and details - Sakshi

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా జెన్యూన్ యాక్సెసరీస్ రేంజ్‌లో భాగంగా ఒక ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లాంచ్ చేసింది. ఇది ఎల్, ఎస్, ఎమ్ అనే మూడు సైజుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర 8,900 యూరోలు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7.69 లక్షలు.

ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆవిష్కరణల్లో భాగంగానే ఈ ఎలక్ట్రిక మౌంటెయిన్ బైక్ విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ బైకులో ఇటలీకి చెందిన ఫాంటిక్ మోటార్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం జరిగింది. ఇది ఆడి ఆర్ఎస్ క్యూ ఈ-ట్రాన్ ఆధారంగా రూపొందించబడింది, అంతే కాకుండా ఈ మోడల్ 2022 డేకర్ ర్యాలీ నాలుగు స్టేజెస్‌లో విజయం సాధించింది.

(ఇదీ చదవండి: Kia Niro: మగువలు మెచ్చిన కారు.. 2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత)

ఆడి ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 720kWh బ్యాటరీ ప్యాక్ బూస్ట్, ఎకో, స్పోర్ట్, టూర్ అనే నాలుగు సైక్లింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులోని ఎకో మోడ్ మాగ్జిమమ్ రేంజ్‌లో ప్రయాణించడానికి, స్పోర్ట్ మోడ్ స్పోర్టీ సైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ హ్యాండిల్ బార్ మీద ఉన్న డిజిటల్ డిస్‌ప్లేలో స్పీడ్, బ్యాటరీ లెవెల్ వంటి వాటిని చూడవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top