ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్‌ | Pure EV offers rs 20000 discount on ecoDryft and eTryst X bikes | Sakshi
Sakshi News home page

ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్‌

Oct 27 2024 8:45 AM | Updated on Oct 27 2024 10:19 AM

Pure EV offers rs 20000 discount on ecoDryft and eTryst X bikes

ముంబై: పండుగ సీజన్‌ సందర్భంగా ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల సంస్థ ప్యూర్‌ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్‌ ఎక్స్‌ మోటర్‌సైకిల్స్‌పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.

నవంబర్‌ 10 వరకు ఈ ఆఫర్‌ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్‌ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్‌ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్‌ ఎక్స్‌ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement