
అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఇటీవల లాంచ్ చేసిన సరికొత్త మోటార్‌సైకిల్ 'ఎక్స్-47 క్రాస్ఓవర్' (X-47 Crossover) అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. మొదటి 24 గంటల వ్యవధిలోనే 3000 కంటే ఎక్కువ బుకింగ్స్ (Bookings) పొందగలిగింది. దీంతో పరిచయ ధరను 5000 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ పరిచయ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). లాంచ్ సమయంలో ఈ ధర కేవలం మొదటి 1000 మందికి మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. అయితే డిమాండ్ భారీగా పెరగడంతో ఈ సంఖ్యను 5000కు పెంచింది. అంటే పరిచయ ధర మొదటి 5000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ఈ బైక్ ధర రూ. 2.74 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుతుంది.
ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు
ఎక్స్-47 క్రాస్ఓవర్ గురించి
ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 10.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. ఛార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 40 హార్స్ పవర్, 610 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 8.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 145 కిమీ/గం కావడం గమనార్హం.