జర్మనీలో నిర్వహించిన అగ్రిటెక్నికా 2025లో ‘ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్’ టాప్ 5 ఫైనలిస్టుల జాబితాలో తమ ఈవీ28 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ చోటు దక్కించుకుందని టఫే ట్రాక్టర్స్ వెల్లడించింది. పర్యావరణహిత ట్రాక్టర్ల కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించింది.
ఈ సందర్భంగా తమ కొత్త తరం ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ట్రాక్టర్ ఈవీఎక్స్75 సహా మూడు ఉత్పత్తులను టఫే ప్రదర్శించింది. యూరోపియన్ రైతుల వైవిధ్యమైన అవసరాల కు ఇవి అనుగుణంగా ఉంటాయని సంస్థ వైస్ చైర్మన్ లక్ష్మీ వేణు తెలిపారు. వీటితో కేవలం ట్రాక్టర్ల తయారీ నుంచి అన్ని రకాల వ్యవసాయ సాధనాలను అందించే సమగ్ర సంస్థగా ఎదిగినట్లవుతుందని వివరించారు.
సబ్–100 హెచ్‌పీ సెగ్మెంట్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చైర్మన్ మల్లికా శ్రీనివాసన్ చెప్పారు. స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తూ ప్రెసిషన్ అగ్‌టెక్, స్మార్ట్ ఫారి్మంగ్, ఆటోమేషన్ మొదలైనవాటిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని వివరించారు.


