
యెజ్డి మోటార్‌సైకిల్ కంపెనీ.. ఇండియన్ మార్కెట్లో తన '2025 రోడ్‌స్టర్' (2025 Yezdi Roadster) బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది.
2025 యెజ్డి రోడ్‌స్టర్ ఆరు ఫ్యాక్టరీ కస్టమ్ కిట్‌లతో లభిస్తుంది. కాబట్టి ఇది సాధారణ రోడ్‌స్టర్ కంటే అద్భుతంగా ఉంటుంది. జావా బాబర్ బైక్ లాంటి సిల్హౌట్ ఈ బైకులో చూడవచ్చు. రీడిజైన్ టెయిల్ ల్యాంప్, ఇండికేటర్ వంటి వాటిని ఈ బైక్ పొందుతుంది. మాడ్యులర్ స్ప్లిట్ సీటు కలిగి ఉన్న ఈ బైకులో అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: కేటీఎమ్ కొత్త బైక్: ధర రూ.1.85 లక్షలు!
2025 యెజ్డి రోడ్‌స్టర్‌లో ఆల్ఫా2 ఇంజిన్ ఉంది. ఇందులోని 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ యూనిట్ 29.1 హార్స్ పవర్, 29.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ ధర సాధారణ మోడల్ ధర కంటే రూ. 4000 ఎక్కువ అని తెలుస్తోంది.