
ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎమ్ తన డ్యూక్ ఫ్యామిలీని ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. దేశీయ మార్కెట్లో కొత్త 'డ్యూక్ 160' లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కేటీఎమ్ డ్యూక్ 125 స్థానంలో లాంచ్ అయిన డ్యూక్ 160 బైక్ 164.2 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 rpm వద్ద, 19 bhp పవర్, 7500 rpm వద్ద 15.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
కొత్త కేటీఎమ్ 160 బైకులోని చాలా భాగాలు కేటీఎమ్ 200 డ్యూక్‌ని పోలి ఉంటాయి. దీని ముందు భాగంలో అప్‌సైడ్-డౌన్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో ప్రీలోడ్-సర్దుబాటు చేయగల మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక 230 మిమీ డిస్క్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో ఉంటుంది.
ఇదీ చదవండి: టెస్లా రెండో షోరూం ప్రారంభం
ఫీచర్స్ విషయానికి వస్తే.. కేటీఎమ్ 160 డ్యూక్ బైకులో కేటీఎమ్ కనెక్ట్ యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ & కాల్/మ్యూజిక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఈ బైక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ & సిల్వర్ మెటాలిక్ మాట్టే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.