
టెస్లా ముంబైలో తన మొదటి షోరూం ప్రారంభించి.. ఇండియన్ మార్కెట్లో 'మోడల్ వై' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు ఢిల్లీలో రెండో షోరూమ్ ప్రారంభించింది.
భారతదేశంలో రెండవ టెస్లా అవుట్‌లెట్ ఢిల్లీలోని ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 వద్ద ఉంది. 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త షోరూమ్ వద్ద, నాలుగు సూపర్‌చార్జర్‌లు కూడా ఉన్నాయి. నోయిడా, హారిజన్ సెంటర్, సాకేత్ వంటి ప్రదేశాలలో సూపర్‌చార్జర్‌లను ఏర్పాటు చేయడానికి కూడా టెస్లా సన్నద్ధమవుతోంది.
ముంబై, ఢిల్లీలలో తన షోరూంలను ప్రారంభించిన టెస్లా తన నెట్‌వర్క్‌ను హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది.
టెస్లా మోడల్ వై
టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?
స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.