
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6'ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మొదటిసారిగా ఈఐసీఎంఏ 2024 వేదికపై కనిపించిన ఈ.. ఈవీ బైక్ 2025-26 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు పెట్రోల్ బైకులను లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ విభాగంలోకి కూడా తన హవా కొనసాగించడానికి సన్నద్ధమవుతోంది. పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6.. లేటెస్ట్ డిజైన్, కొత్త ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ లైట్, అల్యూమినియం ఛాసిస్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వింటేజ్ బైకును గుర్తుకు తెస్తాయి. స్ప్లిట్ సీట్ కలిగిన ఈ బైక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైకుకు సంబంధించిన చాలా స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు.
ఇదీ చదవండి: 24 గంటల్లో 8000 బుకింగ్స్: దూసుకెళ్తున్న విండ్సర్ ఈవీ ప్రో
దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్.. ఒక సింగిల్ ఛార్జితో 100 కిమీ రేంజ్ అందించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ బరువు కూడా 100 కేజీల కంటే తక్కువే ఉంటుందని సమాచారం. కాగా దీని ధర, బుకింగ్స్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.