
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన కొత్త 'విండ్సర్ ఈవీ ప్రో' ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లో 8,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కాగా కంపెనీ ఈ కారు ధరలను కూడా ఇప్పుడు రూ. 60000 వరకు పెంచింది. దీంతో విండ్సర్ ఈవీ ప్రో ప్రారంభ ధర రూ. 18.10 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది.
ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన కొత్త విండ్సర్ ఈవీ ప్రో.. ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 449 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు 136 హార్స్ పవర్, 200 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!
చూడటానికి సాధారణ ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ వెర్షన్ లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా పొందుతుంది. అంతే కాకుండా ఇది సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.