Odysse EV Bike: ఒక్క ఛార్జ్‌తో 125 కిమీ రేంజ్.. రూ. 999తో బుక్ చేసుకోండి!

Odysse vader electric bike launched in india price range and details - Sakshi

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఒడిస్సే ఎలక్ట్రిక్ (Odysse Electric) తన రెండవ ఎలక్ట్రిక్ బైకుని  అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి రేంజ్ అందించేలా రూపుదిద్దుకుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్: 
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ (Odysse Vader Electric) బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం మార్చి 31 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జులైలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

డిజైన్:
ఈ బైక్ చూడగానే ఆకర్శించే మంచి డిజైన్ పొందుతుంది. ఇది డ్యూయెల్​ టోన్​ ఫినిష్, ఎల్​ఈడీ హెడ్​లైట్​, టెయిల్​లైట్​, హాలోజెన్​ ఇండికేటర్స్​, స్ప్లిట్​ సీట్స్​, స్పోర్టీ డెకల్స్​, అలాయ్​ వీల్స్, చిన్న ఫ్లై స్క్రీన్​ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ 14 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా పొందుతుంది.

(ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు: మార్చిలో ఏకంగా..)

ఫీచర్స్:
కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ బైకులో 7 ఇంచెస్ ​ఆండ్రాయిడ్​ టీఎఫ్​టీ టచ్​స్క్రీన్​ ఉంటుంది. కావున వినియోగదారుడు దీని ద్వారా బ్లూటుత్​ కనెక్టివిటీ ఆప్షన్ పొందటమే కాకుండా..  బైక్ లొకేటింగ్, జియో ఫెన్సింగ్, లో బ్యాటరీ అలర్ట్‌, యాంటీ-థెఫ్ట్​ వంటి సమాచారం తెలుసుకోవచ్చు.

బ్యాటరీ & రేంజ్:
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త వాడర్ ఎలక్ట్రిక్ బైక్ IP67 రేటెడ్ 3.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ పొందుతుంది. ఇది 170 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 125 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది రైడర్ ఎంచుకునే రైడింగ్ మోడ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ కేవలం 4 గంటల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top