సంచిలో పట్టే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర ఎంతంటే? | Arma E-scooter Is A Compact Foldable Electric Scooter With A Swappable Battery, Details Inside - Sakshi
Sakshi News home page

సంచిలో పట్టే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర ఎంతంటే?

Feb 11 2024 10:47 AM | Updated on Feb 11 2024 1:13 PM

Arma E-scooter Is A Compact Foldable Electric Scooter With A Swappable Battery - Sakshi

ఎక్కడకు వెళ్లినా అక్కడ ఒక వాహనం అందుబాటులో ఉంటే ఆ సౌకర్యమే వేరు. రైళ్లలోను, విమానాల్లోను దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లు గమ్యం చేరుకున్నాక ఆటో లేదా ట్యాక్సీని ఆశ్రయించక తప్పదు.

వెంట సొంత వాహనాన్ని తీసుకువెళ్లగలిగితే బాగుంటుందనుకున్నా, అందుకు వీలుండదు. అయితే, ఎక్కడకైనా తేలికగా సంచిలో పెట్టుకుని తీసుకుపోగలిగే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను జపాన్‌కు చెందిన ‘ఆర్మా’ ఇటీవల విడుదల చేసింది. 

పని పూర్తయ్యాక దీన్ని సులువుగా మడిచేసుకుని సంచిలో లేదా సూట్‌కేసులో సర్దేసుకోవచ్చు. దీని బరువు 4.5 కిలోలు మాత్రమే! అంటే, స్కూలు పిల్లల పుస్తకాల బ్యాగు కంటే తక్కువే! కాబట్టి దీనిని మోసుకుపోవడం కష్టమేమీ కాదు. దీని గరిష్ఠ వేగం గంటకు 30 కిలోమీటర్లు. రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో వాహనాల మధ్య కాస్తంత చోటులోంచి దీనిపై సులువుగా ప్రయాణించవచ్చు. దీని ధర 1.35 లక్షల యువాన్లు (రూ.76,203) మాత్రమే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement