
ధర రూ.2.49 లక్షల నుంచి ప్రారంభం
ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తాజాగా ఎక్స్–47 క్రాసోవర్ బైక్‌ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 2.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 323 కి.మీ. రేంజి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే తొలి’ రాడార్ ఇంటిగ్రేటెడ్ బైక్’ అని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో నారాయణ్ సుబ్రమణియం తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 వాహన విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అలాగే ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 30,000 యూనిట్ల నుంచి 1 లక్ష యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అలాగే ఉత్పత్తుల శ్రేణిని కూడా వచ్చే ఏడాది మరింతగా విస్తరించనున్నట్లు నారాయణ్ చెప్పారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!