వేడర్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్‌ డెలివరీ షురూ.. ఎప్పటి నుంచి అంటే? | Odysse Vader Electric Motorcycle Deliveries To Start In December | Sakshi
Sakshi News home page

వేడర్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్‌ డెలివరీ షురూ.. ఎప్పటి నుంచి అంటే?

Published Sat, Nov 25 2023 10:22 AM | Last Updated on Sat, Nov 25 2023 2:01 PM

Odysse Vader Electric Motorcycle Deliveries Coming Soon - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తమ వేడర్‌ మోటర్‌బైక్‌ డెలివరీలను డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభించనుంది. వాహన నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐసీఏటీ) సర్టిఫికేషన్‌ లభించినట్లు సంస్థ సీఈవో నెమిన్‌ వోరా తెలిపారు.

7 అంగుళాల ఆండ్రాయిడ్‌ డిస్‌ప్లే, ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 125 కి.మీ. రేంజి, గంటకు 85 కి.మీ. టాప్‌ స్పీడ్, కాంబీ బ్రేకింగ్‌ సిస్టం, 4 గంటల్లోనే పూర్తిగా చార్జ్‌ అయ్యే లిథియం అయాన్‌ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement