ప్రైవేట్ రంగ సంస్థ షాలిమార్ పెయింట్స్ తాజాగా బిల్డింగ్ మెటీరియల్స్ బిజినెస్‌ను జత చేసుకోనుంది. ఇందుకు వీలుగా హెల్లా ఇన్‌ఫ్రా మార్కెట్ లిమిటెడ్‌తో విలీనంకానుంది. ఈక్విటీ స్వాప్ ద్వారా విలీనానికి తెరతీయనున్నట్లు షాలిమార్ పేర్కొంది. ఇన్‌ఫ్రా.మార్కెట్ ద్వారా బిల్డింగ్ మెటీరియల్స్ ప్లాట్‌ఫామ్‌ను హెల్లా ఇన్‌ఫ్రా నిర్వహిస్తోంది.
తాజా విలీనం ద్వారా టైగర్ గ్లోబల్, యాక్సెల్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ తదితర పీఈ, వీసీ ఫండ్స్‌తోపాటు నిఖిల్, కామత్ బ్రదర్స్, నితిన్ వాటాదారులుగా అవతరించనున్నట్లు షాలిమార్ పెయింట్స్ తెలియజేసింది. రెండు సంస్థలను ఓకే లిస్టెడ్ కంపెనీలో భాగం చేయనున్నట్లు పేర్కొంది.
వెరసి 1902లో ఏర్పాటైన షాలిమార్ పెయింట్స్ పెయింట్లతోపాటు ఇన్‌ఫ్రా.మార్కెట్‌తో విలీనం ద్వారా కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్ తదితర బిజినెస్‌లలోకి సైతం ప్రవేశించనుంది. గతేడాది(2025–26) షాలిమార్ ఆదాయం రూ. 570 కోట్లుకాగా.. రూ. 18.5 కోట్ల ఇబిటా నష్టం ప్రకటించింది. మూడు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇన్‌ఫ్రా.మార్కెట్‌తో విలీనం తదుపరి సంయుక్త సంస్థ అంచనా ఆదాయం 2025-26లో రూ. 19,839 కోట్లకు చేరనుంది.


