breaking news
Dharmasthala Niyojakavargam Movie
-
‘ధర్మస్థ నియోజకవర్గం’ మూవీ రివ్యూ
టైటిల్:ధర్మస్థ నియోజకవర్గంనటీనటులు:సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ కుమార్, తదితరులునిర్మాత: మేరుం భాస్కర్దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోటసంగీతం: మహావీర్ ఏలేందర్ఎడిటింగ్ : సాయిబాబు తలారివిడుదల తేది: సెప్టెంబర్ 4, 2026కథేంటంటే..ధర్మస్థల నియోజకవర్గం ఎమ్మెల్యే బైర్రాజు(సాయి కుమార్) ఓ సీనియర్ రాజకీయ నాయకుడు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు. అదే నియోజకవర్గంలో వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి కాలేజీని నడుపుతూ అందులోనే డ్రగ్స్ దంగా చేస్తుంటారు. అక్కడ స్టూడెంట్స్‌కి విశ్వ(శివ కుమార్) ద్వారా డ్రగ్స్ అందించి.. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేస్తుంటారు. ఇలా విద్యార్థులను చెడగొడుతున్న కాలేజీ యాజమాన్యం, విశ్వపై పోరాటం చేస్తుంది అదే కాలేజీ లెక్చరర్ అరుంధతి(వితిక షేరు). ఆమెకు అదే కాలేజీ స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా(రాయంచ కొక్కురు)తోడుగా ఉంటారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. తన కొడుకు హత్య వెనుక ఎమ్మెల్యే బైర్రాజు ఉన్నాడని తెలిసి టీ కొట్టు అమ్ముకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయాల్లోకి వస్తాడు. విద్యార్థుల సపోర్ట్‌తో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైర్రాజుపై పోటీకి దిగుతాడు. ధనబలం ఉన్న బైర్రాజుపై ఛాయ్‌వాలా ఈశ్వరయ్య గెలిచాడా లేదా? ఎన్నికల్లో గెలిచేందుకు బైర్రాజు వేసిన ఎత్తులను విద్యార్థులతో కలిసి ఈశ్వరయ్య ఎలా చిత్తు చేశాడు? బద్రి చావుకు కారణమైన వారిని ఎలా శిక్షించారు? ఈశ్వరయ్య గెలిచాక ధర్మస్థల నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటి? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. పొలిటికల్ యాక్షన్ డ్రామాకి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. సరైన పాయింట్ ఎంచుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చ. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌ని పాయింట్‌గా తీసుకొని దానికి పొలిటికల్ టచ్ ఇచ్చి ఓ మంచి కథను రాసుకున్నాడు. అయితే దాన్ని స్క్రీన్‌పై అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యాడు. క్రైమ్ డ్రామాకి పొలిటికల్ టచ్ ఇచ్చి గ్రిప్పింగ్‌గా కథను చెప్పిన విధానం బాగుంది. కానీ చాలావరకు కథనం ఊహకు అందేలా సాగుతుంది.ఫస్టాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం తిరుగుతుంది. డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడంతో... ఇంటర్వెల్ ట్విస్ట్... సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది.సెకండాఫ్‌లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజు... ఈశ్వరయ్య చేసే పొలిటికల్ కాంపెయిన్... తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు... ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. అలాగే దుస్టుల సహవాసం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం.ఎవరెలా చేశారంటే..టీ అమ్ముకునే ఓ సామాన్య ఈశ్వరయ్య పాత్రలో సుమన్ చక్కగా నటించాడు.సెకండాఫ్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఏడు సార్లు గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకుంటాడు. అయితే ఇలాంటి పాత్రలు ఆయన ఇప్పటికే చాలా పోషించడంతో కొత్తగా అనిపించదు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు.. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో చక్కగా నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, చివర్లో వరుణ్ సందేశ్, కాలకేయ ప్రభాకర్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సాంకేతిక విషయాలకొస్తే.. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.సందర్భానుసారంగా రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆలోచింప జేస్తాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ఫస్టాప్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'ధర్మస్థల నియోజకవర్గం' గొప్ప సినిమా అవుతుంది: వివి వినాయక్
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలు చేసిన సినిమా ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించారు. ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారమే(సెప్టెంబర్ 4) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ వివి.వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి సినిమా చేశాడని చంద్రబోస్ నాతో చెప్పారు. కథ బాగా నచ్చి ఈ సినిమాకు ఒక్క రూపాయి తీసుకోకుండా సంతోషంగా అన్ని పాటలు రాశానని ఆయన అన్నారు. ఇది గొప్ప సినిమా అవుతుందనే నమ్ముతున్నాను అని వినాయక్ చెప్పుకొచ్చారు.రంగస్థలం తర్వాత అంత సంతోషంగా ఈ చిత్రానికే పాటలు రాశాను. అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యాన్ని అందించే సందర్భాలు ఈ సినిమాలో ఉన్నాయి. అలాంటి సందర్భాలను దర్శకుడు జ్ఞానప్రభ క్రియేట్ చేశారు. ఐదు పాటలు ఎంతో సంతృప్తినిచ్చాయి అని చంద్రబోస్ అన్నారు. -
తెరపై విలన్.. నిజ జీవితంలో సున్నిత మనసు..
కళ్లలో కసి.. మాటల్లో గాంభీర్యం.. తెరపై కనిపిస్తే ప్రత్యర్థులకు భయం పుట్టించే విలన్ పాత్రలు. కానీ నిజ జీవితంలో మాత్రం సున్నితమైన మనసున్న కళాకారుడు. తన నటనతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖవాసి సీనియర్ నటుడు సత్యప్రకాశ్.విశాఖ తిమ్మాపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీ ప్రయాణం, విశాఖతో అనుబంధం, కుమారుడి సినీ భవిష్యత్‌పై తన కలలను పంచుకున్నారు.అక్కయ్యపాలెం నుంచి వెండితెర వరకు..అక్కయ్యపాలెంలో పుట్టిన సత్యప్రకాశ్‌కు చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. సినీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి అవకాశం ఇచ్చారని, తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా మరువలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు.‘పోలీస్ స్టోరీ’తో మొదలైన విలన్ ప్రయాణంవిలన్గా తన సినీ ప్రస్థానం ‘పోలీస్ స్టోరీ’ చిత్రంతో ప్రారంభమైందని సత్యప్రకాశ్ తెలిపారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా సాగిన ఆయన ప్రయాణంలో ఇప్పటివరకు 700కు పైగా సినిమాల్లో నటించారు. ‘సరిపోదా శనివారం’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల్లోనూ కనిపించిన ఆయన.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, ‘ఫౌజి’, నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలతో పాటు మరో 14 చిత్రాల్లో నటిస్తున్నారు.అవార్డుల కంటే చిరు ఇచ్చిన కారు ప్రత్యేకంసుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి తనకు ఇచ్చిన బహుమతిని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని సత్యప్రకాశ్ చెప్పారు. ‘బిగ్‌బాస్ సినిమా సమయంలో చిరంజీవి నాకు ఇచ్చిన కారు నా జీవితంలో ప్రత్యేక జ్ఞాపకం’ అని ఆయన భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.వైజాగ్.. నా అదృష్టంవిశాఖవాసిగా పుట్టడం నా అదృష్టం. ఇక్కడి ప్రజలు సినిమాలను మాత్రమే కాదు.. కళాకారులను కూడా తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారు. ప్రకృతి అందాలతో విశాఖ ఓ అద్భుతమైన సినిమా వేదిక అని సత్యప్రకాశ్ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైన విజువల్స్ అందించగల సామర్థ్యం విశాఖకు ఉందని, మరిన్ని చిత్రాల షూటింగ్‌లు ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు.కుమారుడ్ని హీరోగా తీర్చిదిద్దుతూ..తాను ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తన కుమారుడు నటరాజ్‌ను హీరోగా చూడాలన్నదే తన కోరిక అని సత్యప్రకాశ్ తెలిపారు. ఇప్పటికే కన్నడంలో ‘మనసు మల్లిగె’, ‘ఉగ్రావతార’, తెలుగులో ‘ఉల్లాలా ఉల్లాలా’, ‘అమ్మదీవెన’ వంటి చిత్రాల్లో నటరాజ్ హీరోగా నటించారు.సెప్టెంబర్ 4న ‘ధర్మస్థల నియోజకవర్గం’నటరాజ్ హీరోగా నటించిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుందని సత్యప్రకాశ్ తెలిపారు. ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారని, ఇది తన కుమారుడి కెరీర్లో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు నటరాజ్‌కు అందాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.ఇవీ చదవండి: దండాలయ్యా రీమిక్స్ అయ్యా? -
‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ సాంగ్ (ఫొటోలు)
-
నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)
-
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
క్రిష్, చంద్రబోస్ చేతుల ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట రిలీజ్
‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సంయుక్తంగా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు.సినిమా కథాంశానికి అనుగుణంగా ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని పేర్కొంది. పాట విడుదల కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట, నిర్మాత మెరుం భాస్కర్, సంగీత దర్శకుడు యేలెంధర్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ హనుమతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ‘‘మా సినిమా పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రతి అడుగులోనూ చంద్రబోస్ గారు మాకు అండగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.ఈ చిత్రంలో నటరాజ్, రాయంచ కొక్కుర, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, శివకుమార్ రామచంద్ర వారపు, వితిక షేరు, వరుణ్ సందేశ్, కస్తూరి, హారిక, కాలకేయ ప్రభాకర్, షఫీ, ఛత్రపతి శేఖర్, ఐ డ్రీమ్ అంజలి, సత్య ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
పొలిటికల్ ఎంటర్ టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’
వరుణ్ సందేశ్ ,వితికా షేరు, సుమన్ ,సాయికుమార్ , నటరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ధర్మస్థల నియోజకవర్గం. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిమూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుo భాస్కర్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి నూతన సంవత్సర కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ "మా చిత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్ సుమన్ లతోపాటు యంగ్ హీరోస్ కూడా నటించారు.మంచి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. చంద్ర బోస్ గారు అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. చంద్రబోస్ గారు అందించిన లిరిక్స్ కు సునీత గారు వినసొంపైన వాయిస్ ఇచ్చారు. అన్ని హంగుల్తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం . తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు .


