పొలిటికల్ ఎంటర్ టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ | Dharmasthala Niyojakavargam First Look Released | Sakshi
Sakshi News home page

పొలిటికల్ ఎంటర్ టైనర్‌గా ధర్మస్థల నియోజకవర్గం.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Jan 2 2026 12:46 PM | Updated on Jan 2 2026 1:24 PM

Dharmasthala Niyojakavargam First Look Released

వరుణ్ సందేశ్ ,వితికా షేరుసుమన్ ,సాయికుమార్ , నటరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ధర్మస్థల నియోజకవర్గం. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్నిమూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుo భాస్కర్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి నూతన సంవత్సర కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్‌.  

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ "మా చిత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్ సుమన్ లతోపాటు యంగ్ హీరోస్ కూడా నటించారు.

మంచి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. చంద్ర బోస్ గారు అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. చంద్రబోస్ గారు అందించిన లిరిక్స్ కు సునీత గారు వినసొంపైన వాయిస్ ఇచ్చారు. అన్ని హంగుల్తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం . తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement