మందుపార్టీకి ఒంటరిగా రమ్మన్నారు: బాలీవుడ్‌ నటి | Vaishnavi MacDonald on Casting Couch and why She Quit Movies | Sakshi
Sakshi News home page

మగవాళ్ల పార్టీకి ఆహ్వానం.. సింగిల్‌గా రమ్మని కండీషన్‌.. అందుకే!

Feb 18 2026 3:21 PM | Updated on Feb 18 2026 3:38 PM

Vaishnavi MacDonald on Casting Couch and why She Quit Movies

ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న నటి వైష్ణవి మెక్‌డొనాల్డ్‌.. తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పేసింది. గత కొంతకాలంగా బుల్లితెరపైనే సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించింది. వైష్ణవి మాట్లాడుతూ.. ఒక పెద్ద సినిమాలో ప్రధాన పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. పోస్టర్స్‌, బ్యానర్స్‌ కూడా రెడీ అయ్యాయి. 

అందరూ మగవాళ్లే..
కానీ తర్వాత మాత్రం మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కారణమేంటంటే.. నేను ఎక్కడికి వెళ్లిన అమ్మను వెంట తీసుకునే వెళ్తాను. కానీ ఓ సాయంత్ర కాలం మీటింగ్‌ కోసం ఒంటరిగా రమ్మన్నారు. ఆ పార్టీలో అందరూ మగవాళ్లే ఉంటారని, కలిసి మందు తాగొచ్చని చెప్పారు. నాకది నచ్చలేదు. అమ్మ ఎల్లప్పుడూ నా వెంటే ఉండటం వాళ్లకూ నచ్చలేదు. 

హీరోకి నాపై ఆసక్తి
షూటింగ్‌ కోసం నేను స్విట్జర్లాండ్‌ వెళ్లాల్సి ఉంటుందని ఆ నిర్మాణ సంస్థ నాకు పాస్‌పోర్ట్‌ తీసిపెట్టింది. కానీ మా అమ్మకు మాత్రం పాస్‌పోర్ట్‌ రెడీ చేయలేదు. పైగా హీరోకు నాపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అతడి ప్రపోజల్‌ రిజక్ట్‌ చేయడంతో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి నన్ను సినిమా నుంచి తీసేశారు. అది చాలా పెద్ద సినిమా. నేను అందరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. నా పని నేను చేసుకుంటూ పోయేదాన్ని. 

సినిమా నుంచి సీరియల్‌
ఆచితూచి పాత్రల్ని ఎంపిక చేసుకునేదాన్ని. దాంతో రానురానూ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలోనే శక్తిమాన్‌ సీరియల్‌కు ఓకే చెప్పాను. ఇది నా కెరీర్‌కు ఎంతో తోడ్పడింది అని చెప్పుకొచ్చింది. హిందీలో బాబుల్‌, సాంచా, మమ్మీ పంజాబీ, సూపర్‌ నాని వంటి పలు చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై శక్తిమాన్‌, మే ఢిల్లీ హూ, కసౌటీ జిందగీ కే, మిలే జబ్‌ హమ్‌ తుమ్‌ వంటి పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది.

చదవండి: నా విజయానికి నా ప్రతిభ కారణం కాదు: చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement