ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ | Bigg Boss Rithu Chowdary Shares Cute Video With Thanuja Puttaswamy | Sakshi
Sakshi News home page

Rithu Chowdary: ఆరోజు రానే వచ్చింది.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

Feb 18 2026 12:57 PM | Updated on Feb 18 2026 1:05 PM

Bigg Boss Rithu Chowdary Shares Cute Video With Thanuja Puttaswamy

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో ఇద్దరు ఫైర్‌బ్రాండ్స్‌ ఉన్నారు. వాళ్లే రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామి. తనపై మాటలదాడికి దిగినవారికి కౌంటర్స్‌ ఇవ్వడంలో రీతూ దిట్ట అయితే టాస్క్స్‌ ఆడటంలో, మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడంలో తనూజ దిట్ట. వీళ్లిద్దరి స్నేహం చూస్తుంటే ప్రేక్షకులకు భలే ముచ్చట వేసేది. 

ఫ్రెండ్‌తో ఎంజాయ్‌
సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. నిజమైన మిత్రులు అనిపించుకున్నారు. ఇకపోతే షో అయిపోయి కొన్ని నెలలు కావొస్తుండగా తాజాగా తొలిసారి ఈ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. ఫిబ్రవరి 16 రాత్రి షాపింగ్‌ చేస్తూ, నచ్చిన ఫుడ్‌ లాగిస్తూ, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను రీతూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఎన్నిసార్లు అనుకున్నామో!
బిగ్‌బాస్‌ అయిపోయాక ఒకసారి బయటకు వెళ్లి ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ కాలక్షేపం చేయాలని షోలో ఉండగానే అనుకున్నాం. చాలాసార్లు ఇలాంటి ప్లాన్స్‌ వేసుకున్నాం. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. మేమిద్దరం కలుసుకున్నాం. నవ్వుకున్నాం, మనసారా మాట్లాడుకున్నాం, ఆనందంగా గడిపాం. ఇది నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ ఫ్రెండ్‌షిప్‌ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: 

Advertisement
 
Advertisement
Advertisement