ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నువ్వే: చిరంజీవి | Chiranjeevi Emotional Birthday Wishes To His Wife Surekha With Throwback Photos, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Chiranjeevi: నా ప్రతి అడుగులో నువ్వే.. నా సక్సెస్‌కు కారణం నువ్వే..

Feb 18 2026 1:26 PM | Updated on Feb 18 2026 1:35 PM

Chiranjeevi Birthday Wishes to Surekha: I am what I am because of You

ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉంటుందంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి కొణిదెల. ఈరోజు (ఫిబ్రవరి 18న) సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. "1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగింది. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా నిలబడింది. 

నావాళ్లను ఎంతో ప్రేమగా..
ఈరోజు తన పుట్టినరోజు, అలాగే అడ్వాన్స్‌ పెళ్లి రోజు జరుపుకుంటున్నందున నా హృదయం సంతోషంతో నిండిపోయింది. మన కుటుంబానికి నువ్వే కేంద్రబిందువు. మా అందర్నీ నీ ప్రేమతో బంధించేశావు. నా కుటుంబసభ్యులందర్నీ నీ సొంతవాళ్లలా చూసుకున్నావు. ప్రతి క్షణం వారికి తోడుగా ఉన్నావు. నా తల్లిదండ్రులకు నిజమైన కూతురిగా మారిపోయావు. వాళ్లెంత ప్రేమగా చూసుకున్నారో నువ్వూ అంతే ప్రేమగా చూసుకున్నావు.

నా సక్సెస్‌కు కారణం నువ్వే
నా విజయానికి నా టాలెంట్‌, స్వయంకృషి కారణం కాదు. నా సక్సెస్‌కు నువ్వే ప్రధాన కారణం. నువ్వు ప్రతి బాధ్యతను నీ భుజాన వేసుకున్నావు కాబట్టే నేను నా వృత్తిపై ఫోకస్‌ చేసి రాణించగలిగాను. కష్టాల్లో, వేడుకల్లో.. అన్నింటిలో నువ్వు మా చేయి పట్టుకుని ముందుకు నడిపించావు. నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా బలం, నా సపోర్ట్‌ సిస్టమ్‌!

నా ప్రతి అడుగులో..
నీ పుట్టినరోజును, అలాగే రాబోతున్న మన పెళ్లిరోజును పురస్కరించుకుని ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీవల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. నీపై నా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ పలు ఫోటోలు షేర్‌ చేశారు. మెగా ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండటానికి కారణమైన సురేఖకు మెగా అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

చదవండి: ఇన్నాళ్లకు కుదిరింది.. సంతోషంలో తనూజ, రీతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement