'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్‌గా చేసి మంచి పేరు తెచ్చుకున్న షాలినీ పాండే.. తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం హిందీలో మూవీస్, సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇన్ స్టాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈమెకు సంబంధించిన ఓ నగ్న వీడియో గత రెండు మూడు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. కానీ అది ఏఐ వీడియోని షాలినీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: వేరేలా కష్టపడొచ్చుగా.. హిజ్రాల తీరుపై బిగ్‌బాస్ అరియానా వీడియో)
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫేక్. ఏఐతో సృష్టించిన అది పూర్తిగా కల్పితమైనది. అందులో ఉన్నది నేను కాదు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ వ్యక్తులని, ముఖ్యంగా మహిళలని లక్ష్యంగా చేసుకుని వేధించడాన్ని తీవ్రంగా ఖండించాలి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సాధారణంగా చూడకూడదు. ఈ వీడియో ఎవరికైనా కనిపిస్తే షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, డౌన్‌లోడ్ లాంటివి చేయొద్దు. బదులుగా రిపోర్ట్ కొట్టండి. బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించండి. వీడియో మరింత మందికి చేరకుండా అడ్డుకోవడంలో సహకరించండి' అని షాలినీ పాండే పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో:జీవీ ప్రకాశ్)


