‘గూగుల్‌ తల్లి’ ని నమ్ముకున్న ఒడిస్సియస్‌.. అందుకే పదేళ్లు పట్టిందా? | The Odyssey AI Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘గూగుల్‌ తల్లి’ ని నమ్ముకున్న ఒడిస్సియస్‌.. అందుకే పదేళ్లు పట్టిందా?

Jul 21 2026 7:45 PM | Updated on Jul 21 2026 8:18 PM

The Odyssey AI Video Goes Viral

ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే చాలు... సీరియస్ మేటర్ అయినా, చిల్ న్యూస్ అయినా క్షణాల్లో మీమ్‌గా మారిపోతోంది. ఎంతటి సున్నితమైన అంశాన్నైనా సరే తమ క్రియేటివిటీతో కాస్త కామెడీ జోడించి మీమ్స్‌గా మలిచేస్తున్నారు. ‘అసలు ఈ యాంగిల్‌లో ఎలా ఆలోచించార్రా బాబూ!’ అనిపించేంతగా కొన్ని మీమ్స్‌ ఉంటాయి. ముఖ్యంగా సినిమాల విషయంలో వేసే మీమ్స్‌ నవ్వుల పువ్వులు పూయిస్తుంటాయి.  తాజాగా వరల్డ్‌ బక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘ది ఒడిస్సీ’పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన ఒక విచిత్రమైన మీమ్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో ఏముందంటే...
ట్రోజన్ వార్ ముగిశాక ఒడిస్సియస్ తన సైన్యంతో కలిసి ‘ఇథాకా’ రాజ్యానికి పదేళ్ల పాటు ప్రయాణించడం వెనుక పెద్ద కథే ఉంది. కానీ, ‘పాపం ఆయన పదేళ్లు లేట్ అవ్వడానికి అసలు కారణం గూగుల్ మ్యాప్సే!’ అంటూ ఓ మీమర్ ఏఐతో సూపర్ ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు.

వీడియోలో సైనికులు మ్యాప్ ఇవ్వబోతే... ‘ఇప్పుడు అవన్నీ ఎందుకు దండగ?’ అంటూ ఒడిస్సియస్ మొబైల్ తీసి గూగుల్ మ్యాప్స్‌లో 'హోమ్ టౌన్ ఇథాకా' అని టైప్ చేస్తాడు. దానికి ఆ మ్యాప్ ‘న్యూయార్క్‌లోని ఇథాకానా?’అని ఎదురు ప్రశ్నిస్తూ ఆయన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. చివరకు ఎలాగోలా రాజ్యం దగ్గరకు వచ్చాక మళ్లీ ‘యూ-టర్న్ తీసుకోండి’ అని తిప్పుతుంది.మనకు కూడా రోజువారీ జీవితంలో పక్కనే ఉన్న అడ్రస్‌కి గూగుల్ తల్లి వంకర్ల దారి చూపించిన అనుభవాలు బోలెడు ఉన్నాయి కదా! అందుకే ఈ వీడియో విపరీతంగా కనెక్ట్ అవుతూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నోలన్ లెవెల్ విజువల్స్ పక్కన పెడితే... ఈ గూగుల్ మ్యాప్స్ గోల చూస్తే ఎవరైనా సరే నవ్వకుండా ఉండలేరు!

బాక్సాఫీస్‌పై దూసుకెళ్తున్న ‘ది ఒడిస్సీ’
క్రిస్టఫర్ నోలన్‌ దర్శకత్వం వహించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం ఈ నెల 17న విడుదలై..సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్‌ డాలర్లకుపైగా (భారత కరెన్సీలో దాదాపు రూ.2,548 కోట్లకు పైనే) గ్రాస్ వసూళ్లను సాధించింది.మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా సోమవారం నాటికి రూ.7.78 కోట్ల వసూళ్లతో కలిపి మొత్తం రూ.64.58 కోట్ల నెట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement