విజయ్‌ ఫ్యాన్స్‌.. ఎంతకు తెగించార్రా? | Trisha Out Family In: Vijay Fans AI Fantasy | Sakshi
Sakshi News home page

విజయ్‌ ఫ్యాన్స్‌.. ఎంతకు తెగించార్రా?

Jun 24 2026 11:56 AM | Updated on Jun 24 2026 12:11 PM

Trisha Out Family In: Vijay Fans AI Fantasy

సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్‌ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి.

తమిళ సినీ వర్గాల్లో, సోషల్‌ మీడియాలో విజయ్‌, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్‌ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్‌ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్‌ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలో

ఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్‌ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్‌ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్‌ పెయిర్‌ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్‌లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది.  అయితే.. ఇన్‌స్టాలో అన్‌ఫాలో కావడం, విషెస్‌ తెలియజేయకపోవడం.. విజయ్‌-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. 

 

 

విజయ్‌ త్రిష బ్రేకప్‌ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్‌ పెడుతూ..  ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్‌కి బర్త్‌డే విషెస్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్‌ చేసిన విజయ్‌ కేక్‌ కటింగ్‌ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. 

ఈ ఫొటో ఆధారంగా తీసుకున్న కొందరు అభిమానులు ఏఐ సాయంతో దాన్ని యానిమేటెడ్‌ వీడియోగా మార్చారు. అయితే అక్కడితో ఆగకుండా తమ ఊహాశక్తికి మరింత పని చెప్పారు. వీడియోలో కేక్‌ కటింగ్‌ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి త్రిషను అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు చూపించారు. ఆ తర్వాత విజయ్‌ కుటుంబ సభ్యులు సడన్‌ ఎంట్రీ ఇచ్చినట్లు, అందరూ కలిసి బర్త్‌డే వేడుకలో పాల్గొన్నట్లు సన్నివేశాలు జోడించారు.

వైరల్‌గా మారిన ఏఐ వీడియో
వీడియోలో విజయ్‌ భార్య సంగీత, కొడుకు జేసన్‌ సంజయ్‌, కూతురు దివ్య సాషా ఆయనతో కేక్‌ కట్‌ చేయించి సరదాగా ఉన్నట్లు ఉంది. ఈ వీడియో పూర్తిగా వినోదాత్మక కోణంలో రూపొందించిన ఏఐ క్రియేషన్‌ అయినప్పటికీ.. అది సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. కొందరు అభిమానులు దీనిని సరదాగా తీసుకుంటూ షేర్‌ చేస్తుండగా, మరికొందరు “ఫ్యాన్స్‌ ఊహాశక్తికి హద్దులే లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు.

ఏఐ ఎరాలో అభిమానుల క్రియేటివిటీ
గతంలో అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్‌ మేడ్‌ వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్‌ అందుబాటులోకి రావడంతో నిమిషాల్లో కొత్త కథలు, కొత్త సన్నివేశాలు సృష్టిస్తున్నారు. డైరెక్టర్ల చెర నుంచి తప్పించి తమ ఫేవరెట్‌ హీరోలను ఫ్లాపులను అడ్డుకున్నట్లు, అలాగే సినిమాల్లో కీలక మలుపులను మార్చేసి.. కథ సుఖాంతాలు చేసినట్లు.. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్‌ అవుతున్నాయి. అలా కథకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమకు నచ్చిన ముగింపును వీడియో రూపంలో చూపిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ తరహాలోనే విజయ్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విజయ్‌ ఫ్యామిలీ వీడియో పూర్తిగా ‘‘ఏఐ ద్వారా రూపొందించిన ఫ్యాన్‌ మేడ్‌ కంటెంట్‌’’ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రల ప్రవర్తన, సన్నివేశాలకు వాస్తవ సంఘటనలతో సంబంధం లేదు. అభిమానుల ఊహాశక్తితో రూపొందించిన వినోదాత్మక వీడియోగా దీనిని చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement