కిడ్స్ స్పెషల్
తీపి ఫలం
జపాన్లో ఒక ఊరు ఉంది. ఆ ఊరంతా పియర్ చెట్లే! ఆ ఊరి పేరు టొట్టోరి. అక్కడ ఇంటి ముందు, బడి ముందు, రోడ్ల పక్కన అంతా పియర్ చెట్లే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? టొట్టోరి కొండ వాలు ఊరు. వర్షం పడితే నీళ్లు నిలవకుండా వెళ్లిపోతాయి.
ఇలాంటి చోటు పియర్ చెట్లకు చాలా ఇష్టం. భలే పెరుగుతాయి. అందుకే ఇక్కడ పండ్లు ఎంతో జ్యూసీగా, తియ్యగా పండుతాయి. టొట్టోరి రైతులు పియర్ చెట్లను చాలా ప్రేమగా చూసుకుంటారు. అక్కడ ఒక పెద్ద పియర్ చెట్ల మ్యూజియం కూడా ఉంది. అందులో 20 మీటర్ల వెడల్పున్న ఒక పెద్ద చెట్టు ఉంది.
అది ఒక్కటే ఏడాదికి 4000 పండ్లు ఇస్తుంది! అందుకే టొట్టోరిలో కొత్త సీజన్ వస్తే మొదటి పియర్ బాక్స్ లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. ఆగస్టు 27న ఒసాకా నగరంలో మొదటి పియర్ పండ్ల వేలం జరిగింది. 10 కిలోల ఒక బాక్స్ పండ్లు ఏకంగా 6,00,000 యెన్లు అంటే మన లెక్కలో దాదాపు 3 లక్షల 40 వేల రూపాయలకు అమ్ముడుపోయింది! ఇది రికార్డ్.
ఇవీ చదవండి: కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా?


