breaking news
Aution
-
5జీ వేలం: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి మంగళవారం ప్రారంభమైన స్పెక్ట్రం వేలానికి భారీ స్పందన లభించింది. తొలి రోజున నాలుగు రౌండ్లలో, నాలుగు కంపెనీలు ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు వేశాయి. నేడు (బుధవారం) కూడా వేలం కొనసాగనుంది. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో కూడా ‘చురుగ్గా‘ పాల్గొన్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంచనాలను దాటి, 2015 రికార్డులను కూడా అధిగమించి తొలి రోజే ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు దాఖలైనట్లు పేర్కొన్నారు. ఆగస్టు 14 కల్లా స్పెక్ట్రంను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. మధ్య, పైస్థాయి బ్యాండ్లకు బిడ్లు.. గత వేలంలో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన 700 మెగాహెట్జ్ బ్యాండ్కు కూడా ఈసారి బిడ్లు వచ్చినట్లు మంత్రి తెలిపారు. మధ్య స్థాయి 3300 మెగాహెట్జ్, పైస్థాయి 26 గిగాహెట్జ్ బ్యాండ్లపై టెల్కోల నుంచి ఎక్కువగా ఆసక్తి వ్యక్తమైనట్లు వివరించారు. 4జీ సర్వీసులతో పోలిస్తే 5జీ టెలికం సేవలు అత్యంత వేగవంతంగా ఉంటాయి. వీటితో అత్యంత నాణ్యమైన వీడియోలు, సినిమాలను కేవలం సెకన్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలీ మెడిసిన్, అడ్వాన్స్డ్ మొబైల్ క్లౌడ్ గేమింగ్ మొదలైన విభాగాల్లో 5జీ సేవలు ఉపయోగకరంగా ఉండనున్నాయి. ప్రస్తుతం 600 మెగాహెట్జ్ మొదలుకుని 26 గిగాహెట్జ్ వరకూ వివిధ ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను వేలం వేస్తున్నారు. చదవండి: RBI: క్లెయిమ్ చేయని నిధులు రూ.48వేల కోట్లు.. వీటిని ఏం చేస్తారంటే! -
విద్యా సాయం
విద్య విలువ గురించి విద్యా బాలన్ ఎప్పుడూ చెబుతుంటారు. చెప్పడమే కాదు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పిల్లలకు సహాయం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి మరో మంచి ప్రయత్నం చేశారు విద్యా బాలన్. దీనికోసం తన చీరను వేలానికి పెట్టారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బు ఢిల్లీకి చెందిన ఓ కమ్యూనిటీ లైబ్రరీకి అందుతుంది. పరిధులను విస్తరించే పుస్తకాలు, అవగాహన కలిగించే పుస్తకాలు కొనుక్కోలేని పిల్లలకు ఈ ఉచిత లైబ్రరీ అవి సమకూరుస్తుంది. కరోనా నేపథ్యంలో లైబ్రరీకి నిధుల కొరత ఏర్పడటంతో విద్యా బాలన్లాంటి కొందరు ప్రముఖులను నిర్వాహకులు సంప్రదించారు. వేలం వేయడానికి ఏదైనా వ్యక్తిగత వస్తువు ఇవ్వాల్సిందిగా విద్యాని నిర్వాహకులు కోరగా, తన చీరను ఇచ్చారామె. ‘‘నాకు చీరలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చేనేత చీరలంటే చాలా చాలా ఇష్టం. నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ‘ప్యూర్ టస్సర్’ చీరను ఇచ్చాను’’ అన్నారు విద్యా బాలన్. ఇంకా మాట్లాడుతూ– ‘‘పుస్తకాలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. తరగతి గదిలో మనం నేర్చుకున్నవన్నీ గొప్ప పాఠాలే. తరగతి గది బయట మనం కలిసే వ్యక్తులు, వాళ్లతో మాట్లాడినప్పుడు తెలుసుకునే విషయాలు, పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం ఇవన్నీ మనకు వెలకట్టలేని జీవిత పాఠాలు అవుతాయి. ఇక లైబ్రరీకి వెళితే ప్రపంచాన్ని మరచిపోవచ్చు. లైబ్రరీలో ఉండే సౌలభ్యమే అది. మన దేశంలో ఉచిత లైబ్రరీలు మరిన్ని రావాలి. కానీ దానికి చాలా నిధులు కావాలి. నా వంతుగా నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది’’ అన్నారు.