కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా? | Colombia Medellin Hill Gravity Race Festival | Sakshi
Sakshi News home page

కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా?

Sep 5 2026 12:14 PM | Updated on Sep 5 2026 12:23 PM

Colombia Medellin Hill Gravity Race Festival

కిడ్స్‌ స్పెషల్‌

వింత రేసు

ఫోటోలో అంకుల్‌ని చూశారా? చిన్న పిల్లాడిలా మూడు చక్రాల సైకిల్‌ మీద దూసుకు΄ోతున్నాడు. పైగా అతను సైకిల్‌ తొక్కడం లేదు, కొండ మీద నుంచి జారుతున్నాడు. ఈ వింత రేసు కొలంబియా దేశం, మెడలిన్‌ నగరంలో జరిగింది.

ప్రతి సంవత్సరం జరిపే దీని పేరు ‘వాలు పండుగ’. కొండ వాలు మీద సొంతగా తయారు చేసుకున్న ఇంజన్‌ లేని బండ్లు, తొక్కనవసరం లేని సైకిళ్లతో రేసులో పాల్గొనాలి. ఈ ఊళ్లో పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారని వాళ్లకు వ్యాపకం కోసం ఇలా బండ్లు తయారు చేయమంటారు.

పిల్లలు తమ చేతులతోనే చెక్కతో, ఇనుముతో ఈ ముచ్చటైన బుడ్డి బండ్లను తయారు చేస్తారు. వాటితో రేసు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు.  ఈ రేసు ఉద్దేశం భయాన్ని గెలవడం. కొండ అంటే భయం కాదు, సరదా అని చెప్పడం. ఇంజిన్‌ లేదు, పెట్రోల్‌ లేదు. ఉన్నదల్లా ధైర్యం, స్నేహితుల చప్పట్లు. అవి చాలు కదా గెలవడానికి.

ఇవి కూడా చదవండి: చిన్నారి జాలి చూపితే.. కుక్క ప్రాణం కాపాడింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement