breaking news
Medellin city
-
కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా?
ఈ ఫోటోలో అంకుల్ని చూశారా? చిన్న పిల్లాడిలా మూడు చక్రాల సైకిల్ మీద దూసుకు΄ోతున్నాడు. పైగా అతను సైకిల్ తొక్కడం లేదు, కొండ మీద నుంచి జారుతున్నాడు. ఈ వింత రేసు కొలంబియా దేశం, మెడలిన్ నగరంలో జరిగింది.ప్రతి సంవత్సరం జరిపే దీని పేరు ‘వాలు పండుగ’. కొండ వాలు మీద సొంతగా తయారు చేసుకున్న ఇంజన్ లేని బండ్లు, తొక్కనవసరం లేని సైకిళ్లతో రేసులో పాల్గొనాలి. ఈ ఊళ్లో పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారని వాళ్లకు వ్యాపకం కోసం ఇలా బండ్లు తయారు చేయమంటారు.పిల్లలు తమ చేతులతోనే చెక్కతో, ఇనుముతో ఈ ముచ్చటైన బుడ్డి బండ్లను తయారు చేస్తారు. వాటితో రేసు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. ఈ రేసు ఉద్దేశం భయాన్ని గెలవడం. కొండ అంటే భయం కాదు, సరదా అని చెప్పడం. ఇంజిన్ లేదు, పెట్రోల్ లేదు. ఉన్నదల్లా ధైర్యం, స్నేహితుల చప్పట్లు. అవి చాలు కదా గెలవడానికి.ఇవి కూడా చదవండి: చిన్నారి జాలి చూపితే.. కుక్క ప్రాణం కాపాడింది! -
పునరావాస కేంద్రం వద్ద పేలుడు: నలుగురు మృతి
కోలంబియా మెడిల్లెన్ నగరంలో పునరావాస కేంద్రం వద్ద శనివారం బాంబు పేలుడు సంభవించింది.నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు పోలీసులు ఉన్నారు.బాంబు పేలుడును కోలంబియా పోలీసు డైరెక్టర్ ఖండించారు.ఆ పేలుడుకు బాధ్యులైన వారిపై సమాచారం అందిస్తే రూ.10 వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. పునరావాస కేంద్రం తలుపు వద్ద బాంబును ఉంచి సెల్ ఫోన్ ద్వారా పేలుడుకు పాల్పడ్డారని పోలీసు డైరెక్టర్ తెలిపారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కోలంబియాలో డ్రగ్స్ బారిన పడిన వేలాది మంది ఆ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. డ్రగ్స్ బారిన పడినవారికి చికిత్స అందించడంపై డ్రగ్స్ ముఠాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దాంతో పేలుడుపై డ్రగ్స్ ముఠాల హస్తం ఉండవచ్చని తాము అనుమానిస్తున్నామని కోలంబియా పోలీసు డైరెక్టర్ వెల్లడించారు. ఆ కోణంలో దర్యాప్తు జరుగుతుందన్నారు.


