కిడ్స్ స్పెషల్
కథ
లక్ష్మి నాలుగో క్లాసు. వరంగల్ దగ్గర ఒక చిన్న పల్లె వాళ్ల ఊరు. వాళ్ల ఇంటి వెనుక వరి పొలం ఉంది. ఒకరోజు వర్షం పడుతుండగా పొలం గట్టు మీద ఒక కుక్కపిల్ల వణుకుతూ కనిపించింది. నల్లగా, చిన్నగా, చెవులు వేలాడుతూ ఉన్న కుక్కపిల్ల. లక్ష్మికి జాలి వేసింది. వానలో తడుస్తూ వెళ్లి ఆ కుక్కపిల్లను ఇంటికి తెచ్చి ‘బుజ్జి’ అని పేరు పెట్టింది.
లక్ష్మి తల్లి దానిని ఒక పాత గుడ్డతో తుడిచి, వేడి పాలు ఇచ్చింది. అప్పటి నుంచి లక్ష్మి, బుజ్జి విడదీయరాని స్నేహితులయ్యారు. లక్ష్మి స్కూల్‌కి వెళ్తే బుజ్జి గేటు దగ్గరే కూర్చునేది. సాయంత్రం ఇద్దరూ కలిసి పొలంలో ఆడుకునేవారు. లక్ష్మి పుస్తకం చదువుతుంటే బుజ్జి పక్కన పడుకుని వినేది.
ఒకరోజు లక్ష్మి పొలంలో ఆడుతూ జారి చిన్న కాలువలో పడింది. నీళ్లు వేగంగా లాగుతున్నాయి. లక్ష్మి ‘అమ్మా!’ అని అరిచింది. ఎవరూ లేరు. బుజ్జి ఒక్క ఉదుటున పరిగెత్తి ఇంటికి వెళ్లి లక్ష్మి తల్లి చీర పట్టుకుని లాగింది. తల్లి ఏదో జరిగిందని పరిగెత్తింది. చూస్తే లక్ష్మి కాలువలో కొట్టుకు΄ోతోంది. తల్లి వెంటనే కాలువలో దిగి లక్ష్మిని బయటకు లాగింది. ఆ రోజు నుంచి ఊరంతా బుజ్జిని ‘హీరో బుజ్జి’ అని పిలిచేవారు. నిజమైన స్నేహానికి మాటలు అక్కర్లేదు, ప్రేమ చాలు.
ఇవి కూడా చదవండి: ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?


