ఢిల్లీలో కొనసాగుతున్న టీపీసీసీ ధర్నా.. పలువురు ఎంపీల మద్దతు | Telangana Congress Protest At Delhi Over BC Reservation Bill Updates | Sakshi
Sakshi News home page

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ధర్నా.. అప్‌డేట్స్‌..

Aug 6 2025 10:39 AM | Updated on Aug 6 2025 1:02 PM

Telangana Congress Protest At Delhi Over BC Reservation Bill Updates

Congress Delhi dharna Updates..

కొనసాగుతున్న కాంగ్రెస్‌ ధర్నా..

  • బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలు
  • ఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీల మద్దతు

👉ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నా సభా స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ విజయ శాంతి కామెంట్స్‌..

  • బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద నిలబెట్టింది బీజేపీ.
  • బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము వదలము.
  • ఈరోజు దేశం ఇంత అభివృద్ధిలో ముందు ఉందని అంటే కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీలే..
  • బీసీ బిల్లులో న్యాయపరమైన చిక్కులు ఉంటే EWS బిల్లు ఎలా అమలు అయ్యింది..
  • బీసీలు తయారు చేసిన కుర్చీలో మీరు కూర్చున్నారు.
  • కానీ మీరు బీసీలకు మాత్రం న్యాయం చేయడం లేదు.
  • 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.

కొండా సురేఖ కామెంట్స్‌..

  • 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలు ఉంటే తప్పేంటి అని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నాను
  • ముస్లింలు మనుషులు కాదా?
  • వారికి ఒటుహక్కు లేదా?
  • రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ, వితంతువు కాబట్టి ఆమెను పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ పిలవలేదు.
  • రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందనే నమ్మకం నాకు లేదు.

 

 


కనిమొళి కామెంట్స్‌..

  • జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ ధర్నాకు హాజరై మద్దతు పలికిన డీఎంకే ఎంపీ కనిమొళి
  • 50 శాతం న్యాయం కాదు.. సంపూర్ణ న్యాయం చేయాలి

 

 

కాసేపట్లో ధర్నా ప్రారంభం..

  • కాసేపట్లో జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా ప్రారంభం​ కానుంది.
  • తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ భారీ ధర్నా
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా.
  • టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం  ధర్నా నిర్వహించనున్నారు.
  • ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు.
  • సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ గారు విచ్చేసి ప్రసంగిస్తారు.
  • తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 
  • కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా స్థాయి ప్రముఖ నేతలు, బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొననున్నారు.
  • ఈ కార్యక్రమం ద్వారా బీసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరాట పటిమను మరోసారి నిరూపించబోతుంది.

👉తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది.

👉జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలో 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కుర్చీలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్‌మంతర్‌కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.

👉మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్‌ కోర్ట్‌లో వసతిని ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement