
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఆధ్యాత్మిక ధామాలను దర్శించే పర్యాటకులతో ప్రకృతి సోయగాలతో అలరారే రమణీయమైన హిమాలయ గ్రామం ‘ధరాలీ’పై వరద విలయం కరాళ నృత్యంచేసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలను భూస్థాపితం చేసింది.


















