
ఢిల్లీ: తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మంత్రి పదవులు విషయంలో హైకమాండ్, సీఎం నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్‌లో తాను లేనంటూ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కేంద్ర పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తాను మొదటి నుంచి ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నారు. మంత్రి వర్గంలో నేనొక సీనియర్ మంత్రినని.. నేనెప్పుడూ తన మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.
రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారని మంత్రి అన్నారు.
కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధం.. ఎంత దూరమైన పోతా’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను.
..నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన. పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు. నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.